2024లో ఏపిలో బిజెపి పాగా, టిడిపి ఖాళీ

Manikyala rao
Manikyala rao, BJP leader

అమరావతి: ఏపి బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపిలో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైకమాండ్‌ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని, ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఏపిలో టిడిపి ఖాళీ అవుతుందని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అలాగే జగన్‌ సర్కారుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని, కంటితుడుపు బడ్జెట్‌గా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న జగన్‌, అవినీతిని బయటపెట్టి చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అనే సందేహం వ్యక్తం చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos