మహేష్ కు 2022 విషాదాన్ని నింపింది..ఏకంగా ముగ్గుర్ని కోల్పోయాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కు 2022 తీరని లోటును మిగిల్చింది. ఒకరు , ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర్ని దూరం చేసింది. ముందుగా తన సోదరుడు రమేష్ బాబు అనారోగ్యం తో జనవరి 08 న కన్నుమూశారు. కొంత కాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. రమేష్ బాబు మరణ వార్త తెలిసి యావత్ టాలీవుడ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. అప్పట్లో గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్కు తీసుకు వెళ్లిన తరువాత ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు సామ్రాట్ మూవీతో హీరోగా పరిచయమై తర్వాత తనకు నటన కలిసి రాదనుకొని నిర్మాతగా మారారు.

తెలుగుతో పాటు పలు హిందీ సినిమాలు కూడా నిర్మించారు. హిందీలో సూర్యవంశం తెలుగులో అర్జున్, అతిధి, దూకుడు వంటి సినిమాలు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత. సెప్టెంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఆవిడ మరణించడానికి కొన్ని రోజులు ముందు నుంచి అనారోగ్యంతో బాధపడ్డారు. వృద్దాప్యం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె కన్నుమూశారు.

అప్పుడే మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణించిన సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడం మహేష్ కు కోలుకోలేని దెబ్బ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఒకే ఏడాది సోదరుడిని తల్లిని తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేనిది అని అంత మాట్లాడుకుంటూ..మహేష్ కు ధైర్యం చెపుతున్నారు.