2021నాటికి భారత్‌ వ్యోమగాములు అంతరిక్షంలోకి

Shivan
Shivan

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ‘గగన్‌యాన్‌’ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ద్వారా 2021 డిసెంబరు నాటికి భారత్‌ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈరోజు వెల్లడించారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే స్వంతంత్రగా మనుషులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ ఉంటుందని అన్నారు. గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున మోడి 2022నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు శివన్‌ 2021 డిసెంబరు నాటికే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తాము. బృందంలో మహిళ కూడా ఉంటారు. ఇది మా లక్ష్యంగ అని శివన్‌ తెలిపారు. వ్యోమగాముల బృందం పూర్తిగా పురుషులతో కూడుకున్నది కాదని.. ఆ బృందంలో ఓ మహిళ కూడా ఉంటారని ఆయన తెలిపారు.