ఒలంపిక్స్‌కు ఖరారైన భారత హకీ షెడ్యూల్‌

ఒలంపిక్స్‌కు ఖరారైన భారత హకీ షెడ్యూల్‌
2020-Tokyo-Olympics-1

టోక్యో: వచ్చే ఏడాది ట్యోక్యో వేదికగా నిర్వహించే ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్ల షెడ్యూల్‌ ఖరారైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) టోక్యో ఒలంపిక్స్‌కు సంబంధించిన ఈవెంట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం తొలిరోజే భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో, మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనున్నాయి. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరఉ ట్యోక్యో ఒలంపిక్స్‌ జరగనున్నాయి. జులై 24న భారీ స్థాయిలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి, ఆ తర్వాత రోజు నుంచి హకీ మ్యాచ్‌లు మొదలుపెట్టనున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో తొలిరోజే భారత్‌ బరిలో దిగనుంది. గ్రూప్‌-ఏలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుండగా, జులై 26న ఆస్ట్రేలియాతో, 28న స్పెయిన్‌తో, 30న అర్జెంటీనాతో, 31న జపాన్‌తో ఆడనుంది. అదే గ్రూప్‌-ఏలో ఉన్న భారత మహిళల జట్టు నెదర్లాండ్‌తో తొలి పోరును ప్రారంభించనుంది. జులై 27న జర్మనీతో, 29న బ్రిటన్‌తో, 31న ఐర్లాండ్‌తో, ఆగస్టు 1న దక్షిణాఫ్రికాతో భారత మహిళలు పోటీపడనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/