సర్వర్‌కు షాక్‌ ఇచ్చిన టిప్‌

2020 tip challenge
2020 tip challenge

మిషిగన్‌: ఓ కస్టమర్‌ బిల్లు కంటే అధికంగా టిప్పు చెల్లించడం చూపి హోటల్‌లోని సర్వర్‌ ఆశ్చర్యానికి గురైంది. ఇలాంటి ఘటన మిషిగన్‌లో చోటు చేసుకుంది. మిషిగన్‌ అల్పేనాలోని థండర్‌ బే రివర్‌ రెస్టారెంట్‌లో డేనియల్‌ ఫ్రాంజోని పని చేస్తున్నారు. హోటల్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ తాను తిన్నదానికి 23డాలర్లు చెల్లించాడు. అయితే అతడు చెల్లించిన క్రెడిట్‌ కార్డు రిసీట్‌ చూసి డేనియల్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే దానిపై టిప్పే 2020 డాలర్లు అని ఉంది. అంతేకాకుండా హ్యాపి న్యూ ఇయర్‌ 2020 టిప్‌ చాలెంజ్‌ అని కూడా రాసి ఉంది. దీన్ని చూసి ఆశ్చర్యకితురాలైన సర్వర్‌ మేనేజర్‌ దగ్గరికి వెళ్లి ఇది నిజమేనా అడిగింది. అయితే ఆ మేనేజర్‌ నిజమేనని చెప్పడంతో ఆనంద పడడం తన వంతైంది. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇలాంటివి నాలాంటి వారి జీవితంలో జరగనే జరగవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు అనంతరం ఆమె కూడా హోటల్‌లో తిని తనకు వడ్డించిన సర్వర్‌కు 20.20 డాలర్లు టిప్‌గా ఇచ్చింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/