2020 నాటికి ‘5జీ’ సేవ‌లు?

5g
5g

ఢిల్లీ: 2020 నాటికి 5జీ సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టెలికాం,
విద్యుత్తు, శాస్త్ర, సాంకేతిక శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.‘ వీలైనంత త్వరగా 5జీ సేవలు అందుబాటులోకి
తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ
అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో ప్రపంచంతో పోటీ పడాలి.’ అని టెలికాం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా అన్నారు.
5జీ టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్రం రూ.500కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. 5జీ టెక్నాలజీ
సాయంతో పట్టణ ప్రాంతాల్లో సెకనుకు 10,000 ఎంబీలు, గ్రామీణ ప్రాంతాల్లో 1000 ఎంబీల వేగంతో సేవలు అందించాలని
కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.