2019 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

WORLD CUP
WORLD CUP

2019 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్‌ ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: కోల్‌కతాలో జరిగిన ఐసిసి బోర్డు మీటింగ్‌లో వచ్చ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేశారు. ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14వరకు ప్రపంచకప్‌ జరగనుంది. ఈ షెడ్యూ ల్‌ ప్రకారం ప్రారంభ మ్యాచ్‌ ఎవరెవరి మధ్య జరగనుందన్న సస్పెన్స్‌ వీడిపోయింది. ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మే30న ఓవల్‌లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10దేశాలు తలపడను న్నాయి. ఇంగ్లాండ్‌లోని మొత్తం 10 నగరాల్లో 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వాహకులు నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రపంచకప్‌కు ఓ ప్రత్యేకత ఉంది.

ఆ ప్రత్యేకత ఏంటంటే 2015 ప్రపంచకప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోలా చిర కాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తలపడటంలేదు. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో భాగంగా జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్‌లో తలపడనుంది. ఇక జూన్‌ 16న టీమిండియాతో పాకిస్తాన్‌ మాంచెస్టర్‌లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో తలపడనుంది. భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ అభిమానులతో హౌస్‌ఫుల్‌ అవుతుందని టోర్నీ నిర్వా హకులు అంచనా వేస్తున్నారు. ఇదే వేదికపై ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో పాటు తొలి సెమీఫైన్‌ కూడా జరగ నుంది. మరో సెమీఫైనల్‌ జూలై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగ నుంది. అంతేకాదు ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను 1992లో ప్రపంచకప్‌లాగా రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.

ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ఇలా:

మే 30న ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా జట్లు ఓవల్‌లో, మే 31న వెస్టిండీస్‌- పాకిస్తాన్‌ జట్టు ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో, జూన్‌ 1న న్యూజిలాండ్‌ – శ్రీలంక జట్లు కార్డిఫ్‌ వేదికగా,జూన్‌ 1న ఆప్టనిస్తాన్‌ – ఆస్ట్రేలియా జట్లు బ్రిస్టల్‌లో తలపడనున్నాయి. జూన్‌ 2న సౌతాఫ్రికా – బంగ్లాదేశ్‌ జట్లు ఓవల్‌, జూన్‌ 3న ఇంగ్లాండ్‌-పాకిస్తాన్‌ జట్లు ట్రెంట్‌ బ్రిడ్జ్‌, జూన్‌ 4న ఆప్గనిస్తాన్‌-శ్రీలంక జట్లు కార్డ్డిఫ్‌, జూన్‌ 5న ఇం డియా-దక్షిణాఫ్రికా జట్లు రోజ్‌బౌల్‌లో,జూన్‌ 6న ఆస్ట్రేలియా -వెస్టిండీస్‌ జట్లు ట్రెంట్‌ బ్రిడ్జ్‌, జూన్‌ 7న పాకిస్తాన్‌ -శ్రీలంక జట్లు బ్రిస్టల్‌, జూన్‌ 8న ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ జట్లు కార్డిఫ్‌, జూన్‌ 8న ఆప్గనిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు కంట్రీ గ్రౌండ్‌, జూన్‌9న ఇండియా-ఆస్ట్రేలియా జట్లు ఓవల్‌ వేదికగా తల పడనున్నాయి. జూన్‌ 10న సౌతాఫ్రికా-వెస్టిండీస్‌ జట్లు హాం ప్‌షైర్‌, జూన్‌ 11న బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్లు బ్రిస్టల్‌లో, జూన్‌ 12న ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్లు కంట్రీగ్రౌండ్‌, జూన్‌ 13న ఇండియా – న్యూజిలాండ్‌ జట్లు ట్రెంట్‌ బిడ్జ్ర్‌, జూన్‌ 14న ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్లు సౌతంప్టన్‌, జూన్‌ 15న శ్రీ లంక -ఆస్ట్రేలియా జట్లు ఓవల్‌, జూన్‌ 15న సౌతాఫ్రికా – ఆప్గనిస్తాన్‌ జట్లు కార్డిఫ్‌, జూన్‌ 16న ఇండియా- పాకిస్తాన్‌ జట్లు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో తలపడనున్నాయి. జూన్‌ 17న వెస్టిం డీస్‌-బంగ్లాదేశ్‌జట్లు కంట్రీగ్రౌండ్‌, జూన్‌ 18న ఇంగ్లాండ్‌- ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, జూన్‌ 19న న్యూజిలాండ్‌- సౌతాఫ్రికాజట్లు ఎడ్జిబాస్టన్‌, జూన్‌20న ఆస్ట్రేలి యా- బంగ్లాదేశ్‌ జట్లు ట్రెంట్‌బ్రిడ్జ్‌లో, జూన్‌ 21ఇంగ్లాండ్‌ -శ్రీలంక జట్లు హెడింగ్లే,జూన్‌ 22న ఇండియా -ఆప్గనిస్తాన్‌ జట్లు రోజ్‌బౌల్‌ వేదికగా తలపడనున్నాయి. జూన్‌ 22న వెస్టిండీస్‌ -న్యూజిలాండ్‌జట్లు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, జూన్‌ 23న పాకిస్తాన్‌ – సౌతాఫ్రికా జట్లు లార్డ్స్‌, జూన్‌ 24న బంగ్లాదేశ్‌ – ఆప్గని స్తాన్‌జట్లు హాంప్‌షైర్‌ బౌల్‌, జూన్‌ 25న ఇంగ్లాండ్‌- ఆస్ట్రేలియా జట్లు లార్డ్‌, జూన్‌ 26న న్యూజిలాండ్‌ – పాకి స్తాన్‌ జట్లు ఎడ్జ్‌బాస్టన్‌వేదికగా తలపడనున్నాయి.జూన్‌ 27న ఇండియా-వెస్టిండీస్‌జట్లు ఓల్డ్‌ట్రాఫోర్డ్‌, జూన్‌ 28న శ్రీలంక- సౌతాఫ్రికాజట్లు రివర్సైడ్‌, జూన్‌ 29న పాకిస్తాన్‌ -ఆప్గనిస్తాన్‌ జట్లు హెడింగ్లే, జూన్‌ 29న న్యూజిలాండ్‌ – ఆస్ట్రేలియా జట్లు లార్డ్స్‌, జూన్‌ 30న ఇండియా – ఇంగ్లాండ్‌ జట్లు ఎడ్గ్బాస్టన్‌, జూలై 1న శ్రీలంక – వెస్టిండీస్‌ జట్లు రివ ర్సైడ్‌ వేదికగా తలపడనున్నాయి.జూలై 2న ఇండియా – బం గ్లాదేశ్‌ జట్లు ఎగ్గ్బాస్టన్‌, జూలై 3న ఇంగ్లాండ్‌-న్యూజి లాండ్‌ జట్లు రివర్సైడ్‌ వేదికగా తలపడనున్నాయి. జూలై 4న ఆప్గనిస్తాన్‌-వెస్టిండీస్‌ జట్లు హెడింగ్లే, జూలై 5న పాకిస్తాన్‌ -బంగ్లాదేశ్‌ జట్లు లార్డ్స్‌, జూలై 6న ఇండియా – శ్రీలంక జట్లు హెడింగ్లేలో, జూలై 6న ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా జట్లు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా తలపడనున్నాయి. జూలై 9న మొదటి సెమీ ఫైనల్‌ (ఒకటి -నాలుగు స్థానాల జట్ల మధ్య) ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరగనుంది. జూలై 10న రెండో సెమీ ఫైనల్‌ (రెండు -మూడుస్థానాలజట్ల మధ్య) ఎడ్జిబాస్టన్‌ వేదికగా జరనగుంది. – జూలై 15న ఫైనల్‌ లార్డ్స్‌ వేదికగా జరగనుంది.