2019 నుంచి కొత్త లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభం?

s9

2019 నుంచి కొత్త లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభం?

న్యూఢిల్లీ: ఐసిసి క్రికెట్‌కు సరికొత్త రూపు అందివ్వ నున్నట్లు తెలుస్తుంది.అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసిసి అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా టెస్టు,వన్డే ఫార్మాట్లలో లీగ్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని,ప్రపంచ టి20 కోసం పుట్‌బాల్‌ తరహాలో రీజనల్‌ క్వాలి ఫయింగ్‌ టోర్నీలు నిర్వహించాలని ఐసిసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటి(సిఇసి) ప్రతిపాదించింది. ఐసిసి బోర్డు నుంచి ఆమోదం లభిస్తే 2019 నుంచి కొత్త లీగ్‌లు ప్రారంభం అవుతున్నాయన్న మాట.నిజానికి బోర్డు సమావేశంలో సిఇసి చేసిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదంతెలుపాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అలా జరుగలేదు. దీంతో వీటిపై ఏప్రిల్‌లో తుది నిర్ణయం తీసుకునేఅవకాశముంది.సిఇసి ప్రతిపాదనలకు ఐసిసి బోర్డు నుంచి ఆమోదం లభిస్తే రెండేళ్ల వ్యవధిలో మొత్తం 12 జట్లు టు- టైర్‌ లీగ్‌లో పోటీపడతాయి.జింబాబ్వే,అప్ఘనిస్థాన్‌ మినహా టెస్టు హోదా గల తొమ్మిది జట్లు ఒకే గ్రూపులో పోటీ పడతాయి.

ఈ తొమ్మిదిజట్లు రెండేళ్ల కాలం లో మిగతా జట్లతో స్వదేశంతో పాటు బయట సిరీస్‌లు ఆడతాయి.ఏదైనా కారణం చేత సిరీస్‌ ఆడకపోతే పాయింట్లు కోల్పోతాయి. అయితే ఒక్కో సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లుండాలి,పాయింట్లు ఎలా అన్నది ఇంకా నిర్ణయించలేదు.లీగ్‌తో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును సిఇసి కల్పించింది. మరోవైపు జింబాబ్వే,అప్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌లు అసోసియేషట్‌ దేశాలతో కలిసి మ్యాచ్‌లు ఆడుతాయి.లీగ్‌ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ నిర్వహించి విజేతను ఐసిసి ప్రకటిస్తుంది.ఇక వన్డేల విష యానికి వస్తే 13 జట్ల మధ్య మూడు సంవత్స రాల వ్యవధిలో వన్డే లీగ్‌ జరుగుతుంది.ప్రతి జట్టు కూడా స్వదేశంతో పాటు బయట కూడా సిరీస్‌ ఆడాల్సి ఉంది.టెస్టు హోదా జట్లతో పాటు అప్ఘనిస్థాన్‌,ఐర్లాండ్‌ వంటి దేశాలు ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ విజేత ఈ వన్డే లీగ్‌ బరిలో నిలుస్తుంది.లీగ్‌ ముగిసే నాటికి తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు ఆతిథ్య జట్టు వరల్డ్‌ కప్‌కు అర్హత సాధి స్తుంది.ఇక మిగిలిన ఐదు జట్లు మరికొన్ని అసో సియేట్‌ దేశాలతో కలిసి వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ఆడతాయి.ఇక వరల్డ్‌ టి20 విషయానికి వస్తే రీజినల్‌ క్వాలిఫయింగ్‌ టి20 టోర్నీలను నిర్వహించాలని సిఇసి ప్రతిపాదిస్తుంది.