2019లో సిరిసిల్లా నుంచే పోటీ

                                  2019లో సిరిసిల్లా నుంచే పోటీ

KTR
KTR

వచ్చే ఎన్నికల్లో నల్గొండలో అన్ని స్థానాల్లో గెలుస్తాం
బిజెపి, మోడి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేదు
నచ్చే ఆటగాళ్లు సచిన్‌, ద్రావిడ్‌, పెదరర్‌, మెస్సీ
తన పుట్టిన రోజున కేకులు, పోస్టర్లు కాదు…మొక్కలు నాటండి
ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో మంత్రి కెటిఆర్‌ సమాధానం
హైదరాబాద్‌: సిరిసిల్లా ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారని, వారి నమ్మకానికి కట్టుబడి ఉంటానని, 2019 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఆదివారం ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో సంభాషించారు. ఆదివారం త్బ్మ్పిౖౖు పేరుతో ఈ సంభాషన్‌ సుమారు గంటా ఇరవై నిమిషాల పాటు సాగింది. ట్విట్టర్‌ సంభాషణలో అనేక అంశాలపై మంత్రి సమాధానాలు, అభిప్రాయాలు వెలిబుచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇలా అనేక అంశాలపై సూటిగా, చతురతతో సమాధానం ఇచ్చారు.తనకు నచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేరు చెప్పారు. ఈ డిసెంబరులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తుందా? అందుకు సిద్దంగా ఉన్నారా అని అడిగితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు. జమిలీ ఎన్నికలను స్వాగతిస్తున్నామన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపి నుంచి పోటీ చేయాలని నాలాంటి యువకులు చాలా మందికోరుకుంటున్నారు మీరు ఏమంటారు అని ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసునని సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జుబ్లిహిల్స్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నిస్తే సిరిసిల్లా ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటాను అక్కడి నుంచి పోటీ చేస్తానని సమాధానం ఇచ్చారు.
బిజెపి, మోడి ప్రభుత్వం పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అంటే లేదు అని సమాధానం ఇచ్చారు. ప్రజలు లెఫ్ట్‌ పార్టీలను ఎప్పుడో వదిలేసారంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తరువాత కూడా తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, తాజాగా తెలంగాణ పోలీసు చేసిన నగర బహిష్కరణపై స్పందించారు. బుద్వేల్‌ ఐటి పార్కు, నిజామాబాద్‌, కరీంనగర్‌ పట్టణాల్లో ఐటి టవర్ల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. వివిధ సమస్యలపైన ట్వీట్‌ చేసిన వారికి సమాధానంగా వారి అంశాలను సంబంధింత శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపి మొదటి స్థానంలో ఉందని, దీనిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా కేవలం 0.09శాతంతో వెనకబడ్డామన్నారు. అయినా మొదటి స్థానంలో ఉన్న ఏపికి శుభాకాంక్షలు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శిగా నిలిచాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతు బందు లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎప్పుడు చేపట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలోని అర్బన్‌ ఇన్‌ఫ్రాపై అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
?ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు ? ధోనీనా, క్లోహ్లినా అంటే రాహూల్‌ ద్రావిడ్‌, సచిన్‌ టెండుల్కర్‌ అన్నారు. నేను వారి తరం నుంచే వచ్చాను అన్న మంత్రి ఇష్టమైన పుట్‌బాలర్‌ లయెనల్‌ మెస్సీ, పెదరర్‌ ఇష్టమైన ఆడగాడన్నారు. ఆదివారం నాటి ఫ్రాన్స్‌, క్రోయేషిమా మ్యాచ్‌లో ప్రపంచంలోని అధిక శాతం అండర్‌డాగ్‌ జట్టుకే మద్దతు ఇస్తుందన్నారు. ప్రపంచ మొతంలో బరాక్‌ ఒబామా నచ్చే రాజకీయ నేత అన్నారు. నిజా కళాశాలలో గ్రాడ్యూయేషన్‌ పూర్తిచేశారు కదా మీకు ఎలా అని పిస్తుందంటే నిజాం కళాశాల అద్బుతమైన కళాశాల అన్నారు. భారత యువత బలమంతా యువతేనని మరో ప్రశ్నకు సమాధానం తెలిపారు. తన పుట్టిన రోజున కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మీరు నచ్చిన బీరు ఏది అని నెటిజన్‌ అడగగా ఆ విషయం చెప్పను అంటూ కెటిఆర్‌ బదులిచ్చారు. అమ్మాయిల ప్రశ్నలకు మీరు రిప్లై ఇవ్వడం లేదంటూ ఓ యుతి ప్రశ్నించగా ఎంత ధైర్యం నాకు అంటూ బదులిచ్చారు. మోడి, రాహుల్‌గాంధీలో ఎవరిని ఎంచుకుంటారంటే ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్టున్నట్లు పేర్కొన్నారు. మరీ ఆంధ్రలో ఎవరూ అని ప్రశ్నిస్తే కాలేజీని వీడిగానే ఖాళీలు పూర్తించడం ఆపేశారంటూ బదులిచ్చారు.