2019లో టిడిపిదే గెలుపు

Yanamala Ramakrushnudu
Yanamala Ramakrushnudu

విజయవాడ: రాష్ట్రాలను బిజెపి అణగదొక్కుతుందని ప్రాంతీయపార్టీలు భావిస్తున్నాయని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వామపక్షాలతో కలిసి ప్రాంతీయ పార్టీలు కూటమిగా మారాలని అనుకాన్నాయని, ఐతే కూటమికి ఎవరు సారథ్యం వహించాలన్నది చర్చించలేదని తెలిపారు. దేశంలో ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఉందని గుర్తించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపిది ఏకపక్ష విజయమే అని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో టిడిపి కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.