2019లో అధికారమే లక్ష్యం

BJP
టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే
పంచపాండవుల్లా ధర్మం వైపున్నాం
తుది విజయం మాదే : డాక్టర్‌ లక్ష్మణ్‌
బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్‌
హైదరాబాద్‌ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనని, 2019లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ అడుగులు వేస్తోందని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ బిజెపి అధ్యక్షులుగా డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పూర్వ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి పార్టీ జెండాను అం దించి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జగత్‌ప్రకాష్‌ నడ్డా, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్‌, హన్స్‌రాజ్‌ గాంగ్వర్‌, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు ఎంపి స్థానాలతో ప్రారంభించి నేడు కేంద్రంలో అధికారం లోకి వచ్చామన్నారు. నరేంద్రమోడీ అధికారం చేపట్టిన 20 నెలల్లోనే ప్రపంచంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతోంద న్నారు. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశా లు పెట్టుబడులు పెట్టడానికి భారత్‌వైపు చూస్తున్నాయన్నారు. తలసరి ఆదాయంలో చైనాను అధిగమించామని అన్నారు. రైతు లకు పంటబీమా కల్పించి ఎన్డీఎ ప్రభుత్వం వారిలో భరోసా కల్పించిందన్నారు. దేశంలో ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు మూడున్నర కోట్లుండగా, మధ్యదళారీలు  లేకుండా పేదలకు నేరుగా లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో జన్‌ధన్‌యోజన పథకం ప్రారంభించి ఒక్క 2014-15లోనే 21కోట్ల ఖాతాలు తెరిపించి చరిత్ర సృష్టించారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ద్వారానే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని, బిజెపి సహారం లేనిదే సాధ్యం కాదని స్పష్టం చేశారు.1997లోనే  తెలంగాణకుఅనుకూలం నిర్ణయం తీసుకున్న పార్టీ బిజెపి అని, తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంత వైరుద్యాలు మరిచి జెఎసితో కలిసి ఉద్యమించిందని గుర్తు చేశారు. యుపిఎ ప్రభుత్వం బిల్లు తీసుకువస్తే బలపరిచిందన్నారు. తెలంగాణ సాధనలో, అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధిలోనూ బిజెపి భాగస్వామ్యమైందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లో ఆరు సెజ్‌లకు, ఫార్మా హబ్‌కు, మెదక్‌ జిల్లా పాశమైలా రంలో ఇండస్ట్రియల్‌ హబ్‌కు అనుమతించామన్నారు. డ్రైపోర్టుకు ఏర్పాటు చేసేందుకు పరిశీలకులను పంపించామని గుర్తు చేశారు. తెలంగాణలో తమ పార్టీఅధికారంలో లేదనే బేధ బావం లేకుండా అభివృద్ధి  సహకరిస్తోందన్నారు.

పంచ పాండవులుగా ధర్మం వైపున్నాం ..విజయం మాదే: డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నూతనంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలను చేర్చుకుని కౌరవ సైన్యంలా టిఆర్‌ఎస్‌ పెంచుకుంటూ పోతుంటే వారిని ఎదుర్కొనేందుకు పంచపాండవుల్లా 5గురు ఎమ్మెల్యేలం ధర్మం వైపు నిలబడి ఉన్నామన్నారు. బిజెపి పల్లెబాట పట్టి ప్రజల ఎజెండాతో 2019లో అసెంబ్లీపై జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. విద్యార్థి నాయకుడిగా, సామాన్య కార్తగా, ముషీరాబాద్‌ డివిజన్‌ పార్టీ ఇంచార్జ్‌ ప్రస్తానాన్ని ప్రారంభించి గత 30ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. నేడు నా సేవలు అవసరమని పార్టీ గుర్తించి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకున్నా ఓ సామాన్య కార్యకర్త ఇంతటి గుర్తింపు లభిందని ఇది బిజెపిలోనే సాధ్యమని అన్నారు. ఈ బహిరంగసభలో మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ధర్మారావు, గ్రేటర్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితరులు హాజరైయ్యారు.