2018లో నోటిఫికేష‌న్లు

APPSC
APPSC

అమ‌రావ‌తిః వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ కోసం 2018లో కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. త్వరలోనే వివిధ నియామకాలకు రివైజ్డ్‌ కేలండర్‌ విడుదల చేస్తామన్నారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఆర్‌అండ్‌బీ భవనంలో కేటాయించిన కొత్త కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం కమిషన్‌ సభ్యులు, కార్యదర్శితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి ఒకటి నుంచి తమ కార్యకలాపాలన్నీ విజయవాడలోని ఈ కార్యాలయం నుంచే జరుగుతాయన్నారు.