మళ్లీ వాయిదా పడ్డ నిర్భయ దోషుల ఉరి

కేంద్రం పిటిషన్‌పై మార్చి 5న విచారణ

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మార్చి 5న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. నిర్భయ కేసులో నలుగురు దోషుల్నీ ఒకేసారి ఉరితీయాలని, విడివిడిగా కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. నలుగురు నిర్భయ నేరస్థుల్నీ విడివిడిగా ఉరితీయాలని కేంద్రం చేసుకున్న అప్పీల్ పెండింగ్‌లో ఉన్నాఉ వారి ఉరికి ట్రయల్ కోర్టు తాజాగా తేదీని జారీ చేయడానికి అది అడ్డు కాబోదని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 14న ఇచ్చిన ఆదేశంలో స్పష్టం చేసింది. నిర్భయ కేసులో నలుగురు దోషు ల్ని ఉరితీసేందుకు తాజాగా మార్చి 3వ తేదీని నిర్ణయించారు. కేం ద్రం, ఢిల్లీ ప్రభుత్వం చేసిన అప్పీల్ జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నవీన్‌సిన్హాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ధర్మాసనం ఈ అప్పీల్‌పై విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/