20,000 నియమకాలు : కాగ్నిజెంట్

Cognizant

అమెరికాకు చెందిన ఐటి దిగ్గజం కాగ్నిజెంట్‌ భారత్‌లో ఈ ఏడాదిలో 20 వేలకు పైగా నియామకాలు చేపట్టనుంది. 2020లో భారత దేశం నుండి ఎక్కువ మంది విద్యార్థులను నియమించనున్నట్లు సంస్థ తెలిపింది. కాగ్నిజెంట్‌ సిఈఓ బ్రియాన్‌ హంఫ్రీస్‌ మాట్లాడుతూ ఎక్కువ మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు డిజిటల్‌గా సిద్ధమవుతున్నారని, అందువల్ల  2020లో ఇంజనీరింగ్‌, సైన్స్‌ గ్రాడ్యుయేట్ల నియామకాలను 30 శాతం పెంచాలని నిర్ణయించుకున్నామని అన్నారు.

దేశీయ క్యాంపస్‌ నుంచి 20 వేకు పైగా విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రణాళికు సిద్ధం చేశామని చెప్పారు. అదనంగా ఐటీ మేజర్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు క్యాంపస్‌ జీతాను సంవత్సరానికి రూ.4 క్షతో 18 శాతం మేరకు పెంచింది. ఓ వైపు నియామకాలు చేపడుతూనే మరోవైపు  2019 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 10,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు కాగ్నిజెంట్‌ ప్రకటించింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/