200 ఏళ్లనాటి మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం

fire accident copy
fire accident

బ్రెజిల్‌ నగరంలో రియోడిజనీరోలోని 200 ఏళ్లనాటి వస్తు ప్రదర్శనశాలలో ఆదివారం రాత్రి 7.30గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పెద్దయెత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మ్యూజియంలో బ్రెజిల్‌ చరిత్రతో పాటు ఇతర దేశాలకు చెందిన 20వేలకు పైగా పురాతన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రకటిచాయి. కాని ప్రమాదానికి కారణాలు తెలియలెదని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు.