అమెరికాలో మళ్ళీ కాల్పులు.. 20 మంది మృతి

అమెరికాలో మళ్ళీ కాల్పులు.. 20 మంది మృతి
Incident Area

US : అమెరికాలో తుపాకీ సంస్కృతికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో నిన్న సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తెగబడ్డ కాల్పులలో 20 మంది మరణించగా 26 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓహియో వద్ద మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో పదిమంది మృతిచెందగా పోలీసులు ఉన్మాదిపై కాల్పులు జరిపి చంపేశారు. మొత్తం మీద 24 గంటలలో మొత్తం 30 మంది పౌరులు కాల్పులకు బలయ్యారు.