20 ఏళ్ల నాటి మధుర స్మృతులు

ట్విట్టర్‌లో షేర్‌ చేసిన హరీష్‌ రావు

kcr, hareesh rao
kcr, hareesh rao

హైదారాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావం నుండి నేటివరకు కూడా పార్టీ కార్యకలాపాలలో మంత్రి హరీష్‌రావు పాత్ర మరువలేనిది. ఎన్నో కార్యమ్రాలలో పాలుపంచుకుంటు రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషిచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెంటే ఉంటు పార్టీ వ్యవహరాలను చూసుకుంటు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ దీనోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై ఏళ్లుగా కెసిఆర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.అందులో గౌరవ శ్రీ కెసిఆర్‌ గారికి, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ 20 వ ఆవిర్బావ దిరోత్సవ శుభాకాంక్షలు. ఈ స్ఫూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతు ఉండాలి అని ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/