20న టిఎస్‌ఎంసెట్‌ (బైపిసి) తుది విడత సీట్ల కేటాయింపు

TS EAMCET
TS EAMCET

హైదరాబాద్‌: టిఎస్‌ఎంసెట్‌ (బైపిసి) తుది విడత సీట్ల కేటాయింపు ఈనెల 20న చేయనున్నారు. దీనికోసం గురువారం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌..శుక్రవారం వరకు ఆఫ్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. మొదటి విడతలో సీట్లను పొంది..ఆయా కాలేజీల్లో జాయినింగ్‌ రిపోర్టు చేయని వారు మాత్రమే ఈ తుది విడత కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేయాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.