20న ఎఐఎడిఎంకె కార్యవర్గ సమావేశం

PALANI, PANNEER
PALANI, PANNEER

చెన్నై: తమిళనాడు ఎఐఎడిఎంకె కార్యవర్గ సమావేశం ఈనెల 20వ తేదీ జరుగుతుందని ప్రకటించింది. పార్టీ సమన్వయకులు ఒ పన్నీర్‌సెల్వం జాయింట్‌ కోఆర్డినేటర్‌ ఎడప్పాడి కె పళనిస్వామిలు పార్టీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ ఇ మధుసూధనన్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, సభ్యులందరూ ఈ సమావేశానికి విధిగా హాజరుకావాలని సమాచారం పంపించారు. ఈ సమావేశం సహజంగా జరిగేదేనని ప్రత్యేకత ఏమీ లేదని, ఆరునెలలకు ఒక పర్యాయం జరగాల్సి ఉందని అన్నారు. పార్టీ, ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈసమావేశం జరుగుతోంది. పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ చేపడుతున్నారు. అనేకపర్యాయాలు ఇప్పటికే వాయిదాపడినప్పటికీ తిరిగి పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. గతంలో 2017 సెప్టెంబరు 12వ తేదీ సమావేశం జరిగింది. తిరిగి ఆరునెలల్లోపు సమావేశాలు జరగాల్సి ఉన్నందున ఇప్పటికీ జరగలేదని అన్నారు. పార్టీ ఎన్నికల సంఘానికి ఈ సమావేశంపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. సమావేశంలో చర్చించదలిచిన అంశాలను తీసుకోవడం, లోక్‌సభ ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధంచేయడం వంటివి ఉంటాయని అంచనా. అలాగే తిరుప్పరంకుంద్రం, తిరువారూర్‌ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరులోనే వీటి ఎన్నికలు జరుగుతాయని అంచనా.