దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

గుజరాత్ లోని జామ్ నగర్ లో గుర్తింపు
దేశంలో 25కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు


అహ్మదాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఇతర వ్యక్తులకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైంది. దేశంలో అలాంటి రెండు ఒమిక్రాన్ కేసులు తాజాగా నమోదయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇవి వెలుగు చూశాయి. దీంతో దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసులు 25కు పెరిగాయి. డిసెంబర్ 4న జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే.

ఆ వ్యక్తి కాంటాక్ట్స్ లోనే ఈ ఇద్దరికి ఇవాళ ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్ లో పెట్టారు. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/