గ్ర‌నేడ్ల‌తో ఉగ్ర‌ దాడి..ఇద్ద‌రు జ‌వాన్ల‌కు గాయాలు

శ్రీన‌గ‌ర్ : నార్త్ క‌శ్మీర్ బారాముల్లా జిల్లాలోని ప‌ల్హాలాన్ చౌక్‌లో భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్ల‌తో దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌తో స‌హా న‌లుగురు పౌరులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను, పౌరుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్టు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. గ్ర‌నేడ్ల దాడి జ‌రిగిన ఏరియాను బ‌ల‌గాలు త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఉగ్ర‌వాదుల ఆచూకీ కోసం బ‌ల‌గాలు కూంబింగ్ చేపట్టాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/