ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల కరోనా కేసులు

మొత్తం మరణాలు..7,78,557

worldwide corona

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 2.2 కోట్లను దాటిపోయింది. బుధవారానికి కరోనా కేసుల సంఖ్య 22,046,135కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 7,78,557 మంది చనిపోయారు. వైర‌స్‌ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో కరోనా కేసులలో అగ్రరాజ్యం అమెరికా ముందంజలో ఉన్నది.

అమెరికా(5,656,204), బ్రెజిల్‌(3,411,872), భారత్‌(2,768,670), రష్యా(937,321) దేశాల్లో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. అమెరికాలో వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,75,092 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌(1,10,019),మెక్సికో(57,774), భారత్‌(53,026) దేశాల్లో అధికంగా కరోనా మరణాలు సంభవించాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/