ఈ దర్శకులు మన దేశానికే గర్వకారణం

2.0 Trailer Function
2.0 Trailer Function

రజినీకాంత్ హీరోగా,  అక్షయ్ కుమార్ విలన్ గా  టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న  ‘2.ఓ’ చిత్రం  థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం  తాజగా జరిగింది.  ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. ఈ ‘2.ఓ’ చిత్రం  సూపర్ డూపర్ హిట్ కానుందని  ఈ మాటలు గుర్తు పెట్టుకొండని’ అంటూ రజనీ,  దర్శకుడు శంకర్ పై  మరియు చిత్రబృందం పై  ఇతర తారాగణం పై   ప్రశంసలు కురిపించారు.

రజనీ  మాట్లాడుతూ.. ‘2.ఓ చిత్రం  థ్రిల్లర్ తో కూడుకున్న యాక్షన్  ఎంటర్టైనర్ అని,  సినిమాలో ప్రధానంగా  యూనివర్సల్ మెసేజ్ కూడా ఉందని తెలిపారు.  ఇక దర్శకుడు శంకర్, ఇండియా జేమ్స్ కామెరాన్ మరియు  ఇండియా స్టీవెన్ స్పిల్ బర్గ్ అని ప్రశంసించారు.  రజనీ ఇంకా మాట్లాడుతూ..  ‘శంకర్ తో పాటు  రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ వంటి దర్శకులు మన దేశానికే గర్వకారణం అని అన్నారు. ఇక  ఈ సినిమా కోసం  బాలీవుడ్ స్టార్ హీరో  అక్షయ్ కుమార్ చేసిన హార్డ్ వర్క్  ఎంతో గొప్పదని.. ఈ చిత్రానికి ఆయన తప్ప  ఇంకెవరూ అలా చెయ్యలేరని రజనీ తెలిపారు.

అదే విధంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ని  దేవుని కుమారునిగా  రజనీ వర్ణించారు.  ఇక ట్రైలర్  విషయానికి వస్తే.. హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌తో మరియు  గ్రాండ్  విజువల్స్ తో ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచుతుంది ట్రైలర్.  అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి  ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.