2.0 మేకింగ్‌ వీడియో విడుదల

RAJANIKANTH
RAJANIKANTH

2.0 మేకింగ్‌ వీడియో విడుదల

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 2.0.. ఈచిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.. లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడారు.. రజనీకాంత్‌గారితో శంకర్‌గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిదని అన్నారు.. ఇండియన్‌ సినిమాలోనే భారీబడ్జెట్‌తో, హైటెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో ఈచిత్ర నిర్మాణం జరుగుతోందన్నారు.. ఈచిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్‌ వీడియోను విడుదల చేశామన్నారు.. ఈనెల 27న ఈచిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నామని తెలిపారు.. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.. రజనీకాంత్‌ సరసన ఎవీూజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్ష§్‌ుకుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.. ఇంకా ఈచిత్రంలో సుధాంశం పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రిజా§్‌ు ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.