2 ఫ్రెండ్స్‌ బెంగళూరు టూ అనంతపూర్‌

2 friends-f
2 friends-f

2 ఫ్రెండ్స్‌ బెంగళూరు టూ అనంతపూర్‌

ప్రేమ, స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు, కన్నడ చిత్రం 2ఫ్రెండ్స్‌. శ్రీనివాస్‌ జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌ దర్శకత్వంలో ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. సూరజ్‌ హీరోగా నటిస్తుండగా, రవీంద్రతేజ, కార్తీక్‌, సానాయ, సారా, స్నిగ్ధ, ధన్‌రాజ్‌, సమీర్‌ దత్‌ ముఖ్యపాత్రదారులు.

వీరిపై హైదరాబాద్లఓ సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం వరంగల్‌ సమీపంలోని లక్నవరం, కంఠాత్మకూర్‌ ప్రాంతాల్లో హీరో, స్నేహితులపై స్వర్ణ మాస్టర్‌ నేతృత్వంలో పాట చిత్రీకరించారు. అనంతరం యూనిట్‌ బెంగళూరు చేరుకుది. అక్కడ హీరో, హీరోయిన్లతో పాటుగా సాయి ప్రకాష్‌, కవిత పాల్గొని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు దర్శకుడు జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్‌ చేస్తున్నారు. స్థానిక అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కాలేజీలో శుక్రవారం నుండి పాట చిత్రీకరిస్తున్నారు. దీనికి స్వర్ణ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. అనంతపురంలో నెలాఖరు వరకు షూటింగ్‌ చేస్తారు. ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాత ముళ్ళగూరు అనంతరాముడు చెప్పారు. మా సంస్థలో ఇది తొలిచిత్రం. కేవలం వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చే విధంగా ఉంటుంది. యూనిట్‌ అంతా సహకారం అందిస్తున్నారు అని అన్నారు. మంచి కథని తయారు చేసుకోవడానికి ఏడాది సమయం పట్టిందని, అభిరుచి ఉన్న నిర్మాత లభించాడని, ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు దర్శకడు జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహన్‌ం టి.సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్‌ ఘటికాచలం. నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌ నాయుడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌.