2 నుండి పవన్‌ తూర్పుగోదావరి పర్యటన

Pawan-
Pawan

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లాలో నవంబర్‌ 2వ తేదీ నుండి జనసేన అధినేత కొణిదల పవన్‌కల్యాణ్‌ తన పర్యటనను ప్రారంభించనున్నారు. తుని పట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుడతారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం తుని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరుసటి రోజు 3వ తేదీ ఉదయం స్థానిక నాయకులతో సమావేశమవుతారు. తదుపరి పత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగిడతారు. కత్తిపూడి జంక్షన్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 4వ తేదీ ఉదయం వంతాడలో లేటరైట్‌ కార్మికులతో సమావేశమవుతారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం జగ్గంపేట్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలను గూర్చి చర్చిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పెద్దాపురంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పెద్దపురం ప్రజలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. 6వ తేదీన కాకినాడ ఎస్‌ఈజడ్‌ నిర్వాసితులు, రైతులతో పవన్‌కల్యాణ్‌ భేటీ ఉంటుంది. ఈ భేటీలో తమ సమస్యలను గూర్చి ఆయనకు వివరిస్తారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురంలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశిచి ప్రసంగిస్తారు. 7వ తేదీన షెడ్యూల్‌ కులాల ప్రజలతో సమావేశం జరుపుతారు. 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలో నిర్వహించే బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ పాలొంటారు.