2రోజుల్లో రూ.10.54 లక్షల కోట్ల ఎంఒయులు

AP CM
AP CM Chandrababu Naidu

2రోజుల్లో రూ.10.54 లక్షల కోట్ల ఎంఒయులు

భాగస్వామ్య సదస్సువిజయవంతం: చంద్రబాబు

విశాఖ: రెండురోజులుగా జరిగిన భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.. ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, సదస్సులో భారీగా అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. రెండు రోజుల్లో రూ.10.54 లక్షల కోట్లు విలువైన ఎంఒయులు వచ్చాయన్నారు. 665 ఒప్పందాలను ఎపి ప్రభుత్వం కుదర్చుకుందన్నారు.. ఒప్పందాల ద్వారా 22.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. అమరావతిలో పెట్టుబడులుకు 4కంపెనీలు ఆసక్తిచూపుతున్నాయనానరు.. సిఆర్‌డిఎ పరిధిలో రూ.లక్షా 29వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరటంతో 2 లక్షలమందికి ఉపాధి లభిస్తుందన్నారు.