2జీ స్కాంపై హైకోర్టును ఆశ్ర‌యించిన సిబిఐ

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః 2 జి స్పెక్ట్రమ్‌ కేసులో మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా, ఎంపి కనిమొళి తదితరులపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌(సిబిఐ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు రాజా, కనిమొళి తదితరులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. దీనిని సిబిఐ హైకోర్టులో సవాల్‌ చేసింది.