దక్షణ తమిళనాడులో భారీ వర్షాలు

Heavy Rain
Heavy Rain

Chennai: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో దక్షణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, నామక్కల్, తిరునల్వేరి, కన్యాకుమారి తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. నీలగిరి-ఊటీ ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. మరో మూడు రోజులపారు ఇదే పరిస్థితి ఉండవచ్చని ప్రభుత్వం, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అల్పపీడనం మరో 24 గంటలలో తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉన్నట్లు హెచ్చరించింది.