197 పరుగులతో రికార్డుకు చేరువలో ధోని

sachin, dhoni
sachin, dhoni

ధోని ఎదుట మరో రికార్డు ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరు మీదుంది. సచిన్‌ 18 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై 652 పరుగులు చేశాడు. తర్వాతి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఉన్నాడు. వీరూ 12 మ్యాచ్‌ల్లో 598 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 455 పరుగులతో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో తొలిస్థానం సంపాదించాలంటే కేవలం 197 పరుగులు కావాల్సి ఉంది. ఆసీస్‌ పర్యటనలో ధోని ప్రదర్శనను చూస్తే ఇది పెద్ద కష్టం కాదని అర్ధమవుతుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. నేపియర్‌ వేదికగా తొలి వన్డే, రెండో వన్డే హామిల్టన్‌లో, మూడో వన్డే వెల్లింగ్టన్‌లో జరగనున్నాయి.