బ్రెజిల్‌లో కొత్తగా 19,373 పాజిటివ్‌ కేసులు

బ్రెజిల్‌లో కొత్తగా 19,373 పాజిటివ్‌ కేసులు
brazil- corona -virus

బ్రెసిలియా: బ్రెజిల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 19,373 కరోనా కేసులు బయటపడ్డాయి. ఆగస్టు 3న బ్రెజిల్‌లో 17,988 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే 20 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా బయటపడిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 33,59,570కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 684 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,08,536గా ఉంది. కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికి మరణాల్లో మాత్రం ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇక బ్రెజిల్ వ్యాప్తంగా ఇప్పటివరకు 24.7 లక్షల మందికి పైగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/