అమ్మాయిలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..

యువతిపై ఐదు నెలలుగా అత్యాచారం

19-year old girl raped
19-year old girl raped

నిజామాబాద్‌: తెలంగాణలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భోదన్‌ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు బెదిరించి గత ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఉదంతం బయటపడింది. ఆ యువతి గర్భం దాల్చిన విషయం కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం యువతి తల్లి దండ్రులు రోజూ కూలి పనులకు వెళ్తుండగా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఇంటి సమీపంలో నివసించే ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌ 25 మరియు అతని స్నేహితుడు రవి 22 రోజూ ఆమె ఇంటికి వెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గత అయిదు నెలలుగా ఈ దారుణం కొనసాగడంతో ఆమె గర్భం దాల్చింది. తల్లి దండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. కాగా అత్యాచారం కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్టేషన్‌ సీఐ రాకేష్‌ గౌడ్‌ తెలిపారు. కాగా అత్యాచారం చేసిన నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/