19న టిడిపిలోకి నందీశ్వర్‌గౌడ్‌

TDP
TDP

హైదరాబాద్‌: ఈనెల 19న టిడిపిలోకి చేరుతున్నట్లు పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యె నందీశ్వర్‌గౌడ్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆశయాల కోసమే టిడిపిలో చేరుతున్నట్లు అన్నారు. నేను ఎమ్మెల్యె స్థాయికి ఎదిగానంటే దానికి కారణం ఎన్టీఆరే అన్నారు. తెలంగాణలో టిడిపి ద్వారానే బిసిలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. మహాకూటమిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తానని ఆయన అన్నారు.