18వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

18th Pashuram Thiruppavai
18th Pashuram Thiruppavai

ఉన్దు మదకళిత్తన్‌ ఓడాద తోళ్‌ వలియన్‌ నన్దగోపాలన్‌ మరుమగళే! నప్పిన్నాయ్!కన్దమ్‌ కమళుమ్‌ కుళలీ! కడైతిఱవాయ్,వన్దు ఎంగుమ్‌ కోళి యళైత్తనకాణ్‌, మాదవిప్పన్దల్‌ మేల్‌ పల్‌కాల్‌ కుయిలినంగళ్‌ కూవినకాణ్‌,పన్దార్‌విరలి! ఉన్‌మైత్తునన్‌ పేర్‌పాడ! శెన్దామరైక్కైయాల్‌ శీరార్‌ వళైయొలిప్ప వన్దుతిఱవాయ్ మకిళ్‌ న్దేలో రెమ్బావాయ్!

పద్ధెనిమిదవ పాట

గురువింద పొదకింద కోయిలలు కూసె కొక్కోరోక్కో అనుచు తోలుకోళ్లు కూసె

గజబలము, భుజబలము ఉన్న
ఓనందు కోడలా! నప్పిన్న తల్లి!
ఘల్లు ఘల్లున పాద ఘజ్జెలదర
అల్లనల్లన కంఠహారాలు కదల
చేమంతిపూబంతి చేతపట్టి అడుగుఅడుగున సింగార మొలుకుచుండ

చిరునవ్వు మొగముపై వెలుగుచుండచెంగల్వ పూవంటి చేతులతో వచ్చి
దయచూపి మాపైన ద్వారాలు తెరువు చేరి మీరిద్దరు చెండులాడేవేళ రసరమ్య భావాల బాసలాడే వేళ
చేరి నీ పక్షాన గెలిపింతుమమ్మ సేవచేసి మీకు తరియింతుమమ్మ.

భావం: ఏనుగులతో పోరాడే శక్తిగలిగిన, చాలా ఏనుగులు కలవాడైన, యుద్ధములో శత్రువులను చూచి వెనుకంజవేయని, భుజబలము గలిగిన నందగోపాలుడి కోడలైన, నీలాదేవిని తలుపు తెరువమంటున్నారు. కోడికూతలు వినవస్తున్నాయి. మాధవీలత ప్రాకిన పందిరిమీద, గుంపులు గుంపులుగ చేరి కోకిలలు కూస్తున్నాయి. సుగంధము వెదజల్లుతున్న కేశపాశములుగల, బంతిని చేతపట్టుకొన్న, ఎర్రతామరను పోలిన బంగారు గాజుల శబ్దముతో ఓ నీలా! సంతోషముతో నడిచివచ్చి తలుపు తీయవమ్మా! మేము నీ బావను కీర్తించుటకు వచ్చినాముఅని వెలుపలి గోపికలు నీలాదేవిని కోరుతున్నారు. ఫలం: లక్ష్మీ కటాక్షం.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/