devineni

రైతాంగ అవసరాలరీత్యా అవసరమైతే…
కొత్తగా ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తాం: మంత్రి దేవినేని
నందిగామ : రాష్ట్రంలో రైతాంగ అవసరాల రీత్యా పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేయటమే కాకుండా, నూత నంగా ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఎపి జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనిరీతిలో ప్రజా సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని వివరించారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగించేవిధంగా రాష్ట్రంలో రూ. 2.75ల వ్యయమయ్యే రెండు పడక గదులతో కూడిన ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్ల్లు వివరించారు. మంగళవారం నందిగామ పట్టణంలో నిర్వహించిన 3వ విడత జన్మభూమి గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఏమైతే వాగ్దానం చేసారో వాటిని ప్రణాళిక బద్దంగా నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలోనే ప్రకటించిన సమయానికి ముందే పట్టిసీమ పథకంద్వారా గోదా వరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని సాధ్యం చేయటానికి ముఖ్యమంత్రి ప్రోత్సాహమే కారణమన్నారు. దేశ చరిత్రలో వృద్దులకు, వితంతులకు నెలకు రూ.1000లు, వికలాంగులకు నెలకు రూ.1000 నుంచి 1500లు చెల్లిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం వైద్యరంగంలో సరికొత్త మార్పులకు నూతన ఏడాది ఆరంభం నుంచి తీసుకుని వచ్చిందన్నారు. ప్రధానంగా ప్రభుత్వాస్పత్రుల్లో వివిధ రకాల రోగ నిర్దారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. మధుమేహం, రక్తంపోటు వంటి జబ్బులకు 104 ఆరోగ్య సేవా సంచార వైద్యశాలలతోపాటుగా ప్రభు త్వాస్పత్రుల్లో మందులను సిద్దంగా ఉంచిందన్నారు. వృద్దులకు సామాజిక పెన్షన్‌తోపాటుగా బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు రేషన్‌ కార్డు ద్వారా అందిస్తున్నందున వారికి పెన్షన్‌ మొత్తంలో రూ.500లకు మించి ఖర్చుకాదని, మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాలో పొదుపు చేసుకోవాలని సూచించారు. వారికి ప్రభుత్వ వైద్యసేవలందే విధంగా ఆరోగ్య కార్యకర్తలు శ్రద్ద వహించాలన్నారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం రెండు దశలద్వారా పశ్చిమ కృష్ణాసాగర్‌ ఆయకట్టు పరిధిలోని 30 వేల ఎకరాల వరకు సాగునీటి ప్రయోజనం లభిస్తుందన్నారు. ఈ పథకాన్ని మెరుగుపర్చేందుకు తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రూ. 5.30 కోట్లు అదనంగా కేటాయించటం జరిగిందన్నారు. ఈ పథకానికి తోడుగా ఎగువన కృష్ణానదిపై సాగర్‌ ఎడమ కాల్వ 16వ దేవినేని వెంకటరమణ బ్రాంచి కెనాల్‌కు అనుసంధానం చేస్తూ మరో ఎత్తిపోతల పథకం నిర్మించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యే శ్రీరాంరాజ గోపాల్‌, తంగిరాల సౌమ్య, శాసనమండలి సభ్యులు తొండెపు దశరధ్‌ జనార్దన్‌ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. సాగునీటి వనరుల సద్వినియోగానికి ఇదే విధంగా అవసరమయిన ఎత్తిపోతలను నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే కాపు సంక్షేమ కార్పోరేషన్‌ను ఏర్పాటుచేసి రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కు చెందిన చలమలశెట్టి సీతారామాంజనేయులను చైర్మన్‌గా, పార్టీ వ్యవస్థాపక సమయం నుంచి ఉన్న నందిగామకు చెందిన వడ్డెల్లి సాంబశివరావును డైరెక్టరుగా ముఖ్యమంత్రి నియమించారన్నారు. పేదవాడి సొంత ఇంటికలను సాకారం చేసిన ఘన త పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్ట్టీరామారావు దైతే, రెండుపడకగదులతో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రన్నదన్నారు. ప్రభుత్వ నిర్మించే 180 నమునా ఇళ్ళను మైల వరం నిమోజకవర్గంలోని కేతనకొండలోని 3.30 ఎకరాల విస్తిర్ణం గల స్ద్దలంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నమునా ఇళ్లలో మలేషియా, టర్కీ, దేశీయ సాంకేతిక పద్దతుల్లో నిర్మించిన ఇళ్లుంటా యని వీటిలో లబ్ధిదారులు ఏ ఇళ్లను ఎక్కువగా ఇష్ట్టపడితే అదే మాదిరి ఇళ్లు అన్ని ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు. నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పురపాలక సంఘం చైర్మన్‌ వై.పద్మావతి సాంబశివరావు, మాజీ సర్పంచి శాఖమూరు స్వర్ణలతా వంశీధర్‌, మండల, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కొండూరు వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.