దేశంలో కొత్తగా 18,870 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451
మొత్తం మరణాల సంఖ్య 4,47,751
corona virus – india
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 18,870 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 28,178 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 3,29,86,180 మంది రికవర్ అయ్యారు. కరోనాతో నిన్న 378 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,47,751కు చేరింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,82,520 మందికి చికిత్స అందుతోంది. కేరళలో నిన్న 11,196 కరోనా కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 54,13,332 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్పటివరకు వినియోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87,66,63,490 గా ఉంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/