దేశంలో కొత్తగా 18,454 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,78,831

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న 14 వేలుగా ఉన్న కేసులు నిన్న 18 వేలకు పెరిగాయి. రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 12,47,506 మందికి పరీక్షలను నిర్వహించగా 18,454 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 160 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇంతకు ముందు రోజు కంటే కొత్త కేసుల్లో 26 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 17,561 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.41 కోట్లకు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,78,831గా ఉంది. ఇప్పటి వరకు 4.52 లక్షల మందికి పైగా కరోనాకు బలయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/