తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగతుంది. తాజాగా వైద్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 1,811 పాజిటివ్ కేసులు నమోదు అవగా…13 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. అలాగే మొత్తం 505 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డిలో 289, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 151, వరంగల్‌లో 102, నల్లగొండలో 61 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 18,263 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,16,202 మంది కరోనా పరీక్షలు జరిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/