రోడ్డు ప్రమాదం… 18 మంది మృతి

బలూచిస్థాన్‌ : పాక్‌లోని బలూచ్‌ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. బస్సు మితిమీరిన వేగంతో ఉండడంతో పాటు మలుపు వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఖుజ్దార్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సింధ్‌ ప్రావిన్స్‌లోని లార్కానా జిల్లా నుంచి ఖుజ్దార్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/