17వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మికం: ధనుర్మాసం ప్రత్యేకం

17th Pashuram-Thiruppavai
17th Pashuram-Thiruppavai


అమ్బరమే! తణ్ణీరే! శోరే! అఱమ్‌శెయ్యుమ్‌
ఎమ్బెరుమాన్‌! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,కొమ్బనార్కెల్లామ్‌ కొళున్తే! కులవిళక్కే! ఎమ్బెరుమాట్టి! యశోదా§్‌ు! అఱివ్ఞఱాయ్,అమ్బరమ్‌ ఊడఱుత్తు ఓంగి యులకళ న్ద ఉమ్బర్‌ కోమానే! ఉఱంగాతెళున్దిరాయ్ శెమ్‌పొఱ్కళలడిచ్చెల్వా! బలదేవా! ఉమ్బియుమ్‌ నీయుమ్‌ ఉఱంగేలో రెమ్బావాయ్!
పదిహేడవ పాట
అన్నవస్త్రము లిచ్చి ఆదుకొను స్వామి కష్టకాలమందు కరుణించు స్వామి
మానందనాయకా! మేలుకొనమయ్యఆడపడుచుల మమ్ము ఆదుకొనుమయ్య కల్పవృక్షము వంటి కన్నతల్లివమ్మ కాంతలకు వెలుగిచ్చు కాంతివమ్మ మాయమ్మ యశోద మన్నించి లేవమ్మ చిన్న కృష్ణుని చూడవేగ వచ్చితిమి మా ప్రాణనాథుని వేడ వచ్చితిమి.కొలిచి లోకాలన్ని అలసి ఉన్నావో నీలిమేఘశ్యామ నిదురలేవయ్యా శేషసాయి నీకు సేద తీర్చెదము బంగారు కడియాల బలభద్రలెమ్ము.
భావం: అన్నం కావలసిన వారికి అన్నము, దప్పిక అయిన వరికి నీరు, వస్త్రములు లేనివారికి వస్త్రములు ఏ ఆశ లేకుండా దానము చేయువాడు నందగోపాలుడు. అటువంటి నందగోపాలుడిని స్వామిని మేల్కొలుపుమని కోరుతున్నారు. సుకుమార శరీరముగల, లేత చిగురులాంటి గోపాలవంశపు మణిదీపము అయిన యశోదను ”ూ స్వామిని లేవపమ్మా అని కోరుతున్నారు. స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కియమును కాలికి తొడుక్కున్న బలరామా, నీవన్నా నీ తమ్ముడిని మేల్కొలుపుము. ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని లోకము లన్నింటిని కొలిచిన త్రివిక్రమా అని పొగుడుతూ ”నిత్య శూరులకు నాయకుడా నిదురింపరాదా మేలుకో అని కృష్ణుడిని కోరుతున్నారు.
ఫలం: విశ్వాసం కలుగుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/