నెమలి గర్వభంగం

నీతి కథ

నెమలి గర్వభంగం

NEETI KADHA
NEETI KADHA

ఒకరోజు పక్షులన్నీ సమావేశమయ్యాయి, ఆ సమావేశానికి నెమలి హాజరవ్వలేదు. నేను పక్షుల్లో అందమైన దానిని. నేను కాకులు, కొంగల వంటి అంధ వికార పక్షులు వచ్చే ఆ సమావేశానికి రాను అని భీష్మంచుకు కూర్చుంది. నెమలిని అభిమానించే పిచ్చుకలు చిలుకలు, పావ్ఞరాలు నెమలి వద్దకు వెళ్లి ” మిత్రమా పక్షుల సమావేశం వనం రక్షణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తల కోసం చర్చ నిమిత్తం కాబట్టి మీరు తప్పకుండా హాజరు కావాలి. వాస్తవానికి వేటగాళ్లు, కట్టెలు కొట్టేవారు తమరు కనిపిస్తే మిమ్మల్నే వేటాడటానికి చూస్తారు. కాబట్టి మీరు మీ రక్షణ చర్యలకైనా ఆ సమావేశానికి రావాలి.

మీరు వేగంగా ఎగరలేరు. ఎక్కువ సమయం ఎగరలేరు. ఎత్తుకు పోయి ఎగరలేరు. అందుకే వనాలు గుబురుగా వ్ఞండాలి అప్పుడే మీరు వేటగాళ్లు, జంతువ్ఞల బారి నుండి తప్పించుకోడానికి చెట్లు, పొదలు మాటుకు వెళ్లిపోవచ్చు. అందుకే వనరక్షణ మన బాధ్యత అని హితవ్ఞ పలికాయి. ”నేను అంత బలహీనురాలిని కాదు. దయచేసి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి. మీరు పని చూసుకోండి అని చెప్పేసింది నెమలి. చేసేది మీ లేక చిలుకలు, పిచ్చుకలు, పావురాలు సమావేశానికి వెళ్లి పోయాయి. ఇతర పక్షులు సందడి హడవడి, అల్లరి దు ఇప్పుడు ప్రశాంతంగా నాట్యం చేసుకోవచ్చు.

పక్షలు అల్లరివల్ల యింతవరకూ నాకు ఒంరి ఆనందం కలగడం లేదు అనుకుంటూ నెమలి ఆనందంతో నాట్యం చేయడం మొదలు పెట్టింది. పొదల మద్య, చెట్లు మద్య నాట్యం ఆనందాన్ని ఇవ్వలేదని బహిరంగ మైదానంలోకి వెళ్లిపోయి, పరిసరాలను గమనించకుండా సంతషంగా నాట్యం చేయడం మొదలు పెట్టింది. ఎక్కనుండి చూసాయోగానీ నక్కల గుంపు ఒక మాటువేసి నెమలిని వేటాడానికి మెరుపుదాడి చేశాయి.

తనచుట్టూ నక్కలను చూసిన నెమలి తనని తాను రక్షించుకోడానికి పరుగులు పెట్టింది. ఎగరడానికి ప్రయత్నాలు చేసింది. చెట్లు, పొదల మాటున దాక్కోడానికి చెట్లును, పొదలను వెదికింది. తాను వనాలకు దూరంగా వచ్చి నాట్యం చేస్తుండటంతో చెట్లు, పొదలు దగ్గర్లో లేక నానా ఇబ్బందులు పడింది. నెమలి బాధలు ప్రత్యక్షంగా చూసిన ఒక కాకిపిల్ల పక్షుల సమావేశం వద్దకు వెళ్లిసమాచారం ఇచ్చింది. ”సమావే శానికి రానందుకు తగిన శాస్తి జరిగింది అని కొన్ని పక్షులు అంటే ”కాదుకాదు ఈ సమయం మనం నెమలిని ఒంటరిని చేసి తప్పు చేయకూడదు.

నెమలి పక్షి అపురూప మైనది దాన్ని కాపాడవలసిన బాధ్యత మనకువ్ఞంది అని ఎక్కువ పక్షులు అన్నాయి. వెంటనే పక్షులన్నీ మెరుపు వేగంతో వచ్చి నెమలిని వెంబడిస్తున్న నక్కలను ముక్కులతో పొడవడం, కాళ్లతో రక్కడం చేశాయి వేలాది పక్షులు ఉకిరి బికిరి చేయడంతో నక్కలు తోకలు ముడిచికొని పారి పోయాయి.

అప్పుడు నెమలి తన తప్పునకు పక్షులను క్షమాపణ కోరింది ”తనకు గర్వ భంగం జరిగిందని చెబుతూ వనాలు, చెట్లు, పొదలు లేకపోవడంవల్లే నన్ను నేను నక్కల నుంచి కాపాడుకోలేక ఇబ్బందులు పడ్డాను. యికపై వనాలు పెంచడం, కాపాడుకోవడం మన బాధ్యత నేనే ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను అంది. నేలను సారవం తంచేసి, విత్తనాలను సేకరించి విత్తనాలు నాటి మొక్కలు పెంచడానికి, తద్వారా వనాలను పెంచడానికి, అలాగే వేట గాళ్లను, కట్టెలు కొట్టేవారిని తరమడానికి జంతువ్ఞలతో కలిసి చర్యలు తీసుకోడానికి పక్షుల సమావేశం తీర్మానాలు చేసింది.

-మీగడ వీరభద్రస్వామి, చోడవరం