కేరళకు 25 కోట్లు తెలంగాణ సాయం

173 people have died in the state since the second spell of monsoon fury began
173 people have died in the state since the second spell of monsoon fury began

కేరళకు 25 కోట్లు తెలంగాణ సాయం

హైదరాబాద్‌ :భారీ వర్షాలు,వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి రూ.25 కోట్లను తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషన్లను కేరళకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు,ఐటి రంగ ప్రముఖులు, వ్యాపార వాణిజ్యవేత్తలు,ఇతర రంగాల వారు ఇతోదిక సహాయం అందించడానికి ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.