టీటీడిలో 170 మంది సిబ్బందికి కరోనా

శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా పాజిటివ్‌

Tirumala Srivari Temple

తిరుమల: కరోనా వైరస్‌ తిరుమలల్లో తన పంజా విసురుతుంది. అక్కడ ఇప్పటివరకూ 170 మంది వైరస్ బారిన పడ్డారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రధానాలయ పెద్దజీయర్‌ స్వామి కూడా ఉన్నారని, ఆయన సహా 18 మంది అర్చకులు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది, కల్యాణకట్టలోని ఇద్దరు, 20 మంది ప్రసాదాల తయారీ కేంద్రమైన పోటు ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో 60 ఏళ్లు నిండిన అర్చకులకు విధుల నుంచి మినహాయింపులు ఇచ్చామని, అర్చకుల సంక్షేమం, వారి భద్రతపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామివారికి అన్ని రకాల కైంకర్యాలు, సేవలు నిరాటంకంగా సాగుతాయని, వైరస్ మరింతగా విస్తరిస్తే, దర్శనాలను మరోమారు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని ఓ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయం అతి త్వరలో తీసుకుంటామని అన్నారు


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/