17 మంది ఎంపిలకు కరోనా

ప్రతి సభ్యుడికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: ఈరోజు నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపిలందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో బిజెపికి 12 మంది ఎంపిలు కాగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు ఇద్దరు, శివసేన, డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం), ఆర్‌ఎల్‌పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ) ఎంపిలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కాగా దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపిలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా మరో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైరస్‌ స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు.

కరోనా పాజిటివ్ వచ్చిన ఎంపిలు వీరే…

•ఎన్.రెడ్డెప్ప
•గొడ్డేటి మాధవి
•మీనాక్షి లేఖి
•అనంత్ కుమార్ హెగ్డే
•పర్వేశ్ సాహిబ్ సింగ్
•సుఖ్ బీర్ సింగ్
•హనుమాన్ బేణివాల్
•సుకనాటా మజుందార్
•ప్రతాప్ రావ్ జాదవ్
•జనార్దన్ సింగ్
•బిద్యుత్ బరణ్
•ప్రదాన్ బారువా
•జి. సెల్వమ్
•ప్రతాప్ రావ్ పాటిల్
•రామ్ శంకర్ కతేరియా
•సత్యపాల్ సింగ్
•రోద్మాల్ నాగర్

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/