చైనాలోని చాంగ్‌చున్‌లో భారీ అగ్ని ప్రమాదం..17 మంది సజీవదహనం

china restaurant fire accident

చైనాలో చాంగ్‌చున్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనం కాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. చైనాలోని జిలిన్ ప్రావిన్సులో చాంగ్‌చున్ సిటీలో మ‌ధ్యాహ్నం ఓ రెస్టారెంట్‌‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని , సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

ఒక్కసారిగా రెస్టారెంట్ అంతట నల్లని పొగలు వ్యాపించాయి. దీంతో అందరు బయటకు రావడానికి ప్రయత్నించిడం వలన తొక్కిసలాట జరిగినట్లు చెపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ ఘటనలో 17 మంది సజీవదహనమయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున ఫైరింజన్ లు, అంబులెన్స్ లు చేరుకొని ఉన్నాయి. గాయపడిని వారిని ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను కోరారు.