16వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మికం: ధనుర్మాసం ప్రత్యేకం

16th Pashuram: Thiruppavai
16th Pashuram: Thiruppavai

నాయగనాయ్ నిన నన్దగోపనుడైయ కోయిల్‌ కాప్పానే! కోడిత్తోనుమ్‌ తోరణ వాశల్‌ కాప్పానే! మణిక్కదవమ్‌ తాళ్‌ తిఱవాయ్ ఆయర్‌ శిఱుమియరో ముక్కు, అఱైపఱై మాయన్‌ మణివణ్ణన్‌ నెన్నలే వాయ్నేర్‌న్దాన్‌ తూయోమాయ్ వన్దోమ్‌ తుయిలెళ పాడువాన్‌,వాయాల్‌ మున్న మున్నమ్‌ మాత్తాదే అమ్మా! నీ, నేశనిలైక్కదవమ్‌ నీక్కేలో రెమ్బావాయ్..

పదహారవ పాట

మా నంద నాయకుని మణి మందిరాన్నికంటికి రెప్పవలె కాచి రక్షించు క్షేత్రపాలక తలుపు తెరిచి పంపించుపాలిచ్చి చంపేటి పాపి పూతన కాముచిగురుటాకుల నడిమి చిన్ని మొగ్గలము పసితనము వీడని పల్లెపడుచులము నీలిరత్నము వంటి తిరుమేను కలవాని నవనీతచోరుని నందగోపాలుని మేలుకొలుపులు పాడి లేపవచ్చితిమి
పచ్చతోరణమున్న పసిడి ద్వారమును దయతలచి తెరువు మా ద్వారపాలక స్వామి,ఆశతో వచ్చితిమి అడ్డు చెప్పక నీవు

భావం:

అది నందగోపాలుని భవనము. జెండాలతో ప్రకాశించుచున్నవి. తోరణములతో అలంకరించబడి యున్నది. మణులతో పొదగబడిన తలుపులు గలది. లోనికేగుటకు గోపికలు, అక్కడ కావలియున్న భవన రక్షకుని అనుమతి కోరుతున్నారు. మాయావి, ఇంద్రనీలవర్ణుడగు సర్వేశ్వరుడు పర అను ధ్వనిచేయు వాయిద్యమును మాకు ఇస్తారని మాట ఇచ్చినాడు. ఏ ప్రతిఫలము ఆశించక పరిశుభ్రంగా వచ్చాము. నిద్ర నుంచి లేచునటుల పాడుటకు వచ్చినాము. నీవు ఏ అభ్యంతరము చెప్పక దృఢముగానున్న తలుపులను తెరువ్ఞము. మమ్ముల లోపలికి వచ్చుటకు అనుమతి నిమ్ము. అని గోపికలు ద్వారపాలకుని ప్రార్థిస్తున్నారు.

ఫలం: ఆచార్యుని అనుగ్రహం లభిస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/