దేశంలో కొత్తగా 1,685 కరోనా కేసులు

దేశంలో 21,530 యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 2 వేలకు దిగువన నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,685 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,499 మంది కరోనా నుంచి కోలుకోగా… 83 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 21,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,78,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,16,755కి చేరుకుంది. ఇప్పటి వరకు 1,82,55,75,120 డోసుల వ్యాక్సిన్ వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/