తెలంగాణలో కొత్తగా 1,640 కేసులు నమోదు

మరో 8 మంది మృతి

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజిృంభణ కొనసాగుతుంది. తాజాగా 1,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎప్పట్లాగానే భారీ సంఖ్యలో కరోనా కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 683 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మరో 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 455కి పెరిగింది. నిన్న 1,007 మంది డిశార్జి కాగా, ఇంకా 11,677 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/