160 కోట్ల సీజ్‌!

cash
cash

160 కోట్ల సీజ్‌!

బెంగళూరు: కర్ణాటక బిజెపి మంత్రిగా బి.శ్రీరాములు ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమాల కేసులో నుంచి రెడ్డి బ్రదర్స్‌ను బయటపడేసేందుకు అప్పటి భారత సర్వోన్నత న్యాయస్థానం ముఖ్యన్యా యమూర్తికి 160కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పారన్న విడియో గురువారం కర్ణాటక సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈమీడియా తుణుకలను కాంగ్రెస్‌పార్టీ మిడి యాకు పంపిణి చేసింది.ఈ ఉదంతం గురించి కెపిసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కెపిసిసి కార్యాధ్యక్షుడు దినేష్‌గుండురావు,కర్ణాటక హోంశాఖ జిజి మంత్రి రామలింగారెడ్డి మాట్లాడారు.ఒఎంసి అక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు కోసం హైకోర్టులో కేసు పెడితే దీనిపై సుప్రీంలో ఎస్‌ఎల్‌పి దాఖలు చేసిన సందర్భంలో బళ్లారి రెడ్డి బ్రదర్స్‌ఆఫ్తుడు అప్పటి జగదీష్‌ శెట్టర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన బి.శ్రీరాములు 2010 మే 8,లేదా 9వ తేదీన సదరు కేసును తన సహచరులకు అనుకూలంగా తీర్పు ఇప్పించేందుకు సుప్రీంకోర్ట్‌ సిజె బాలకృష్ణన్‌తో 160కోట్ల మేరకు డీల్‌ మాట్లాడుకున్నారని దీనిపై 100కోట్లు ముట్టజెప్పగా మరో 60కోట్ల రూపాయల కోసం బయటకు వచ్చిన ఈవివాదంలో బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనిజన్‌,మరో మైనింగ్‌ దళారి పూబాలన్‌, మరో దళారి కెప్టెన్‌ రెడ్డి ఉన్నట్లు వీరంతా ఈ అవినీతి కేసును మాఫీ చేసేందుకు కృషి చేశారని ఆరోపించారు. ఆనాటి మైనింగ్‌ లూటీకోరులకు మళ్లా కర్ణాటక బిజెపి 8మందికి ఎంఎల్‌ఎ టిక్కెట్లు ఇవ్వటం పట్ల ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.ఈ డీల్‌ అంతా శ్రీరా ములు మంత్రిగా నివాసం ఉన్న సర్కారు బంగ్లా లోనే జరిగిందని ఆరోపించారు.చేసుకున్న ఒప్పందం ప్రకారం సుప్రీంకోర్టు ముఖ్య న్యాయ మూర్తి జస్టీస్‌ కెజె.బాలకృష్ణన్‌ తాను జడ్జీగా రిటరయ్యే ముందురోజు రెడ్డి బ్రదర్స్‌కు అను కూలంగా తీర్పునిచ్చి హైకోర్ట్‌ ఆదేశాన్ని తిరస్క రించారని ఆరోపించారు.

ఈ ఉదంతంపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.దేశంలో అవినీతిని ఆమడదూరం తరిమికొడతామని వీరావేశంతో ప్రకటనలు చేస్తున్న ప్రధాని మోడీ తన పార్టీకు చెందిన ఇప్పటి ఎంఎల్‌ఎ అభ్యర్థుల అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెంటనే వెల్లడించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కర్ణాటకలో ప్రకృతి సంపదను 35వేల కోట్ల రూపాయల మేరకు కొల్లగొట్టిన రెడ్డి బ్రదర్స్‌కు నేరుగా సంబంధాలు ఉన్న శ్రీరాములు ఇపుడు కర్ణాటక బిజెపిలో ప్రముఖ నాయకుడుగా ఉన్నారు.ఈయన సిఫార్సు మేరకు బళ్లారి చుట్టు పక్కల జిల్లాల్లో 8మంది సహచరులకు టిక్కెట్లు ఇచ్చారు.

ల్యాండ్‌ మైనింగ్‌ స్కాంలో జైలుపాలైన గాలి జనార్థనరెడ్డి, ఆయనపై కేసులను మాఫీ చేయించేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులకు లంచాలను ఎరవేసి పట్టుబడిన ఉదంతంలో గాలి సోమశేఖరరెడ్డి హస్తం కూడా ఉంది.ఈయన కూడా ఇపుడు బళ్లారి బిజెపి అభ్యర్థి.మరో సభ్యుడు సురేష్‌బాబు,లల్లేష్‌రెడ్డిలకు టిక్కెట్లు ఇప్పించారు.వీరందరూ బళ్లారి అక్రమ మైనింగ్‌లో పేరు మోశారని దినేష్‌ గుండురావు ఆరోపించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన ప్రధాని మోడీ తమ పార్టీ మాజీ మంత్రులు శాసనసభ్యులు చేసిన లూటీ గురించి కర్ణాటక ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.జస్టీస్‌ బాలకృష్ణన్‌ తో జరిపిన 160కోట్ల రూపాయల డీల్‌ పై సమగ్రదర్యాప్తు జరపాలనిడిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడి న్యాయాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన బళ్లారి బిజెపి మాజీనాయకుల టిక్కెట్లను వెంటనే ప్రధాని నిరాకరించి అవినీతి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.