స్మార్ట్‌ఫోన్‌ కోసం యువతి ఆత్మహత్య

Young girl commit suicide in kamareddy
Young girl commit suicide in kamareddy

కామారెడ్డి: జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వని కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని దోమ కొండలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. దోమకొండ గ్రామానికి చెందిన కుకుట్ల మౌనిక(16) కామారెడ్డిలో ఇంటర్‌ చదువుతుంది. అయితే గత వారం రోజులుగా తనకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను పట్టుబట్టింది. దీంతో తల్లిదండ్రులు ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక కొనిస్తామని నచ్చ జెప్పారు. ఎంతకీ వినని మౌనిక తన పంతం కొనసాగించింది. అయితే పరీక్షలు ముగిసాకే కొనిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో మనస్తాపం చెంది, ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడకు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే యువతి మృతి చెందింది.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/